పీకే టీమ్ సూచనతో జగన్ ఎలర్ట్...హద్దు దాటితే...

పీకే టీమ్ సూచనతో జగన్ ఎలర్ట్...హద్దు దాటితే...
x
Highlights

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు రూటు మార్చారు.. నిత్యం చంద్రబాబుపై విమర్శలతో దూసుకుపోతున్న జగన్ ఇప్పుడు హటాత్తుగా తన స్వరం మార్చుకున్నారు.. గళం...

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు రూటు మార్చారు.. నిత్యం చంద్రబాబుపై విమర్శలతో దూసుకుపోతున్న జగన్ ఇప్పుడు హటాత్తుగా తన స్వరం మార్చుకున్నారు.. గళం సర్దుకున్నారు..

వైసీపీ అధినేత జగన్ తన రూటు మార్చారా? తాజా పాదయాత్ర తీరుచూస్తే అలానే అనిపిస్తోంది. ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టినదగ్గరనుంచి చంద్రబాబుపై జగన్ పేల్చని గన్ లేదు. వేయని పంచ్ లేదు పాదయాత్ర పొడవునా చంద్రబాబును ఘాటైన పదజాలంతో విమర్శిస్తూనే ఉన్నారు.2500 కి.మీటర్ల మేర పాదయాత్ర సాగినా అనుక్షణం చంద్రబాబునే జగన్ టార్గెట్ చేశారు. అంతేకాదు అంతకు ముందు కూడా జగన్ నోరు విప్పితే బాబుగారే టార్గెట్ నంద్యాల ఎన్నికల బరిలో కూడా అదే కనబడింది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ చంద్ర బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలకొచ్చిన జనం స్పందన బాగుందని అప్పట్లో మరింత దూకుడు పెంచారు.

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి ఓడిపోయారు.అందుకే ఇప్పుడు జగన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయడం లేదు. చంద్రబాబును నిత్యం విమర్శించడం వల్ల బాబుకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్న అంచనాలో జగన్ ఉన్నారు. అలాంటప్పుడు తాను చంద్రబాబును టార్గెట్ చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని పీకే టీం జగన్ కు సూచించిందట. ఎన్డీఏకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరట రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రజలు పెద్దగా స్వీకరించరనే భావనలో జగన్ ఉన్నారు. హోదా ఇవ్వని మోడి సర్కార్ ను వదిలి కేవలం చంద్రబాబును జగన్ టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని టీడీపీ బలంగా వినిపిస్తోంది. అందుకే జగన్ ఇప్పుడు రూటు మార్చారు. బాబుపై వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా కేవలం పాలన పైనే దృష్టి పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, రాజధాని నిర్మాణాల్లో అక్రమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇసుక, మట్టి మాఫియాకు బాబు సర్కార్ చిరునామాగా మారిందని విమర్శిస్తున్నారు. రైతు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి ఎక్కడికిపోయిందని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా వివరిస్తున్నారు. దీంతో జగన్ వ్యవహర శైలి మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు పాత పద్ధతి బాబు పాలనపై విమర్శలు కొత్త పద్ధతి. ఇది జగన్ మార్చుకున్న రూటు. బాబు విధానాలపై ఎక్కు పెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాప్చర్ చేయడమే యువనేత తాజా ఎత్తుగడ.

Show Full Article
Print Article
Next Story
More Stories