మానసిక సమస్యలతో బాధపడుతూ..
మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని జైహింద్ ఎన్‌క్లేవ్‌లో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న అమ్రీన్ (23) ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేస్తోంది. కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటోంది. అయితే ఇటీవల ఆమెకు మానసిక సమస్య తీవ్రమైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య కు చేసుకుంది. వేరే వ్యక్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అమ్రీన్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




