నా కొడుకునే ప్రేమిస్తావా : యువతి ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
నా కొడుకునే ప్రేమిస్తావా : యువతి ఆత్మహత్య
X

తన కొడుకుని ప్రేమించిందని మందలించడంతో ఆత్మహత్య చేసుకుంది యువతి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు మండలం కావలియడవల్లి వడ్డెరపాళెనికి చెందిన వల్లెపు మస్తాన్‌ కుమార్తె వల్లెపు మమత (16) ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి రేణుకమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో మమతను అమ్మమ్మ గ్రామమైన ప్రకాశం జిల్లా చినపావనిలో ఉంచి 10వ తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ కోసం తండ్రి స్వగ్రామానికి తీసుకువచ్చి ఆత్మకూరులో ఇంటర్మీడియట్ లో చేర్పించాడు. ఆదివారం మస్తాన్ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి గ్రామానికి చెందిన అంకమ్మ వచ్చి నా కుమారుడినే ప్రేమిస్తావా అంటూ తిట్టి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన మమత బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన ఆమె తండ్రి కూతురిని చూసి హతాశుడయ్యాడు. వెన్తనె ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు తెలిసింది. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story