రాజీనామా చేసిన టీమిండియా కోచ్‌..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
రాజీనామా చేసిన టీమిండియా కోచ్‌..
X

భారత మహిళా క్రికెట్ టీం కోచ్ పదవికి తుషార అరోథ్ రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల రీత్యా తాను కోచ్ప పదవినుంచి తప్పుకుంటున్నట్లు అయన చెబుతున్నా.. బలమైన కారణమే ఉందంటున్నారు క్రికెట్ అభిమానులు. గత ఆరు సీజన్ల నుంచి ఆసియా కప్‌లో ఛాంపియన్స్‌గా నిలుస్తున్న టీం ఇండియా మహిళ జట్టుకు ఈ ఏడాది పరాభవం తప్పలేదు. బంగ్లాదేశ్‌తో ఈ సీజన్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో జట్టు కోచ్ తుషార అరోథ్ సభ్యులను సరిగా సమన్వయ పరచలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

nanireddy

nanireddy

Next Story