విశాఖలో టీమిండియా విన్నింగ్ షో

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
విశాఖలో టీమిండియా విన్నింగ్ షో
X

శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ ను....విశాఖపట్నం మనవడు రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 2-1తో గెలుచుకొంది. విశాఖ ACA- VDCA స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో...ఆతిథ్య టీమిండియా........వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. సిరీస్ విజేతగా నిలవాలంటే నెగ్గితీరాల్సిన ఈమ్యాచ్ లో ..ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న టీమిండియా....ప్రత్యర్థి శ్రీలంకను 44.5 ఓవర్లలో 215 పరుగుల స్కోరుకే కుప్పకూల్చింది. 216 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన టీమిండియా...ప్రారంభఓవర్లలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ నష్టపోయినా...మరో ఓపెనర్ శిఖర్ ధావన్- వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ ల కీలక భాగస్వామ్యంతో పుంజుకోగలిగింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమిండియాకు ఇదే తొలి వన్డే సిరీస్ కావడం విశేషం. భారత్ వేదికగా శ్రీలంక ఇప్పటి వరకూ 10 సిరీస్ ల్లో తలపడితే...కనీసం ఒక్క సిరీస్ నెగ్గలేకపోయింది. టీమిండియాకు మాత్రం శ్రీలంక ప్రత్యర్థిగా ఇది తొమ్మిదో సిరీస్ గెలుపు. అంతేకాదు...విశాఖ వేదికగా టీమిండియాకు ఆడిన ఏడు వన్డేల్లో ఇది ఆరవ గెలుపు కూడా.

lakshman

lakshman

Next Story