భారత్‌ ఘనవిజయం

nanireddy
Updated on: 24 Dec 2018 1:37 PM IST
భారత్‌ ఘనవిజయం
X

భారత క్రికెటర్లు విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళా t20 మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు సాధించారు. ఓపెనర్లు మోనా మెష్రామ్‌(32), స్మృతీ మంధాన(29) శుభారంభాన్నివ్వగా, అనుజా పటేల్‌(22), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(27 నాటౌట్‌) రాణించారు. అనంతరం చేజింగుకు దిగిన థాయ్‌లాండ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 66 మాత్రమే చేసి ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణుల్లో నటయా బూచాథామ్‌(21)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, చాయ్‌వాయ్‌(14), సుధిరువాంగ్‌(12)లే రెండంకెల స్కోరును దాటారు.

nanireddy

nanireddy

Next Story