బాంగ్లాదేశ్ 222 ఆల్ అవుట్

nanireddy
Updated on: 24 Dec 2018 3:14 PM IST
బాంగ్లాదేశ్ 222 ఆల్ అవుట్
X

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగుకు దిగిన బాంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 45 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా. కేడర్ జాదవ్ 2 వికెట్లు, బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీశారు. బంగ్లా ఆటగాళ్లు లిటన్ దాస్ 117 బంతుల్లో 121 పరుగులు చేసి బంగ్లాను ఆదుకున్నాడు. మెహిడీ హాసన్ 32, సౌమ్య సర్కార్ 33 పరుగులు చేశారు. టీమిండియా విజయ లక్ష్యం 223.

nanireddy

nanireddy

Next Story