టీమిండియా ధనాధన్ విక్టరీ..

టీమిండియా ధనాధన్ విక్టరీ..
x
Highlights

మూడు వన్డేల సిరీస్‌ లో భారత్‌ అద్భుత శుభారంభాన్నిచ్చింది. బౌలింగ్‌... బ్యాటింగ్‌ విభాగాల్లో తమదైన శైలిలో ఇంగ్లాండ్ పై విరుచుకుపడిన కోహ్లీ సేన...

మూడు వన్డేల సిరీస్‌ లో భారత్‌ అద్భుత శుభారంభాన్నిచ్చింది. బౌలింగ్‌... బ్యాటింగ్‌ విభాగాల్లో తమదైన శైలిలో ఇంగ్లాండ్ పై విరుచుకుపడిన కోహ్లీ సేన ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు (6/25).. రోహిత్‌ శర్మ అజేయ శతకం (114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 నాటౌట్‌), కోహ్లీ (82 బంతుల్లో 7 ఫోర్లతో 75) భారత్ మంచి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. ఉమేశ్‌ యాదవ్‌ 2, చహల్‌ ఒక వికెట్‌ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయానందుకుంది. ఇక అత్యధికంగా ఆరు వికెట్లు పడగొట్టడంతో కుల్దీప్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories