ఈ వివాహం వారే కుదిర్చారు : రేణుదేశాయ్

nanireddy
Updated on: 24 Dec 2018 1:49 PM IST
ఈ వివాహం వారే కుదిర్చారు : రేణుదేశాయ్
X

పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి రేణుదేశాయ్ పుణేలో ఉంటోంది. పూర్తిగా సినిమాలు చేయడం మానేసిన రేణు అడపాదడపా షో లు మాత్రం చేస్తోంది. అయితే ఆమె పెళ్లిపై ఇటీవల ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'ఒంటరితనం వేధిస్తున్నా.. పిల్లలిద్దరినీ చూసుకుంటూ వారిలోనే ఆనందాన్ని వెతుకుంటూ సంతోషంగానే ఉన్నాను. వారే నా జీవితం అనుకున్నాను. కానీ నాజీవితంలోకి ఇప్పుడు మరో వ్యక్తి రాబోతున్నారు. ఆయనతో ఉన్నప్పుడు కూడా అంతే సౌకర్యంగా ఉంటానని నమ్ముతున్నాను. ప్రేమ అనేది జీవితంలో ఒక్కసారే కలుగుతుంది. మళ్లీ మళ్లీ సంభవించదు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని సన్నిహితులు చూశారు, వారే ఈ వివాహం కుదిర్చారు. ఆయన చాలా మంచి మనిషి. అందుకే కలిసిఉండడం కంటే సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను' అని రేణూదేశాయ్ వెల్లడించారు.

nanireddy

nanireddy

Next Story