నేను కింగ్ కాదు కింగ్ మేకర్..: అక్బరుద్దీన్ ఒవైసీ

నేను కింగ్ కాదు కింగ్ మేకర్..: అక్బరుద్దీన్ ఒవైసీ
x
Highlights

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ మేకర్ని తానేనంటూ...

తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ మేకర్ని తానేనంటూ కలకలం సృష్టించారు. డిసెంబర్ 11వ తేదీన ఏం జరగబోతోందో చూడమంటూ మరింత సస్పెన్స్ రేపారు. ఇంతకీ అక్బరుద్దీన్ లెక్కలేంటి.? అక్బరుద్దీన్ కింగ్ మేకర్ అయితే మరి కింగ్ ఎవరు..? కుమార స్వామి సీఎం కాగా లేనిది అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కాలేడా..?ఎంఐఎం ఎవర్నైనా సీఎంను చేస్తుంది..వద్దనుకుంటే దించేస్తుంది.

తెలంగాణ ఎన్నికలు తెరపైకి వచ్చిన తర్వాత ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలివి. తాను సీఎం ఎందుకు కాకూడదంటూ గతంలో వ్యాఖ్యానించి కలకలం రేపిన అక్బరుద్దీన్ ఎంఐఎం దయ ఉంటేనే ఎవరైనా సీఎంగా ఉండగలరని వ్యాఖ్యానించి తాజగా కలకలం సృష్టించారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఎంఐఎం తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేయగలదని అన్నారు. అంతేకాదు చంద్రబాబు మొదలు కేసీఆర్ వరకు అందరూ ఎంఐఎం దగ్గర తల వంచిన వారేనని అన్నారు. అయితే తాను బాద్షాని కాదనీ కింగ్ మేకర్‌ని మాత్రం తానే అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీన ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెడతామో చూడండని అన్నారు.

కింగ్ మేకర్‌నంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. మజ్లిస్ పార్టీ తమ మిత్రపక్షమని నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ బహిరంగంగా అంగీకరించిన కొద్ది గంటల్లోనే అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , ప్రజాకూటమి మధ్య హోరా హోరీ పోటీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి, (

అక్బరుద్దీన్ కింగ్ మేకర్ కావాలంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడాలి. ఎంఐఎం మద్దతుతోనే ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలి. అప్పుడే అక్బరుద్దీన్ లెక్క సరిపోతుంది. మరి అక్బరుద్దీన్ జోస్యం ఫలిస్తుందో లేదో తేలాలంటే డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories