వీడిన చందానగర్ ట్రిపుల్ మర్డర్ మిస్టరీ కేసు

x
Highlights

హైదరాబాద్ లో సంచలనం సృష‌్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. సహాజీవనం చేస్తున్నవాడే కాలయముడయ్యాడు. చిన్నారితో సహా ముగ్గురిని హత్య చేశాడు....

హైదరాబాద్ లో సంచలనం సృష‌్టించిన ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. సహాజీవనం చేస్తున్నవాడే కాలయముడయ్యాడు. చిన్నారితో సహా ముగ్గురిని హత్య చేశాడు. తాను సహాజీవనం చేస్తున్న మహిళ..మరో వ్యక్తితో క్లోజ్‌గా వుండటం జీర్ణించుకోలేక మారణాకాండ సృష‌్టించాడు. పోలీసు విచారణలో హంతకుడు మధు నేరాన్ని అంగీకరించాడు.

అభం శుభం తెలియని చిన్నారి అని చూడలేదు. 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ అనే కరుణించలేదు. పదేళ్లు సహాజీవనం చేసిన మహిళ అనే సానూభూతి చూపించలేదు. ఈ ముగ్గురిని మధు దారుణంగా హత్య చేశాడు. చందానగర్ వేపకుంట అపార్ట్ మెంట్ లో అపర్ణ నివాసం ఉంటోంది. వివాహితుడైన మధు గత పదేళ్లుగా అపర్ణతో సహాజీవనం సాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కార్తికేయ అనే కూతురు ఉంది. కొంత కాలం గా మధుకు అపర్ణ కు మధ్య వివాదం తలెత్తడంతో అపర్ణ.. తల్లి విజయమ్మ, కూతురు కార్తికేయతో కలిసి విడిగా నివాసం ఉంటుంది.

చందానగర్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పనిచేసే అపర్ణకు ఇటీవల సెల్ ఫోన్ షాప్ యాజమాని రూప్ లాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి క్లోజ్ గా ఉండడం మధు సహించలేకపోయాడు. గత శనివారం అపర్ణ ఇంటికి వచ్చిన మధు...కిచెన్ లో ఉన్న అపర్ణను గోడకేసి హత్య చేశాడు. ఆ తర్వాత పెద్దావిడ విజయమ్మ, నాలుగేళ్ల కార్తికేయను గొంతు నులిమి చంపి పారిపోయాడు.

రెండు రోజులు గా అపర్ణ నివాసం ఉంటున్న ప్లాట్ డోర్ తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని స్థానిక చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు డోరు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా అపర్ణ , కూతురు కార్తికేయ , తల్లి విజయమ్మ రక్తపు మడుగులో శవాలై పడి ఉన్నారు. క్లూస్ టీ మ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మూడు స్పెషల్ టీమ్ లతో హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ హత్యకాండ వ్యవహారం వెలుగులోకి రాగానే మధు రామచంద్రపురం పోలీసులకు లొంగిపోయాడు. రూప్ లాల్ ను చందానగర్ లో అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో అపర్ణ, చిన్నారి కార్తికేయ, పెద్దావిడ విజయమ్మను తానే హత్య చేసినట్లు మధు నేరాన్ని అంగీకరించాడు. రూప్ లాల్ తో అపర్ణ క్లోజ్ నెస్ గా ఉండడం సహించలేక హత్య చేసినట్లు చెప్పాడు. సంచలనం సృష‌్టించిన ఈ ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు కొన్ని గంటల్లోనే తేల్చడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories