హైదరాబాద్ లో ప్రేమోన్మాది దారుణం

హైదరాబాద్ లో ప్రేమోన్మాది దారుణం
x
Highlights

హైదరాబాద్‌‌‌లో దారుణం జరిగింది. లాలాగూడ మెయిన్‌ సెంటర్లో ప్రేమోన్మాది బరితెగించాడు. అందరూ చూస్తుండగానే నడుచుకుంటూ వె‌ళ్తున్న యువతిపై ఓ యువకుడు...

హైదరాబాద్‌‌‌లో దారుణం జరిగింది. లాలాగూడ మెయిన్‌ సెంటర్లో ప్రేమోన్మాది బరితెగించాడు. అందరూ చూస్తుండగానే నడుచుకుంటూ వె‌ళ్తున్న యువతిపై ఓ యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దాంతో యువతి సంధ్యారాణికి 70శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. యువతిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
లాలాపేట్‌ భజనసమాజ్‌కి చెందిన సంధ్యారాణి ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న సంధ్యారాణిని అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ప్రేమోన్మాది‌. ప్రేమించాలంటూ కొద్దిరోజులుగా సంధ్యారాణి వెంటపడుతోన్న లాలాపేట వినోభానగర్‌కి చెందిన కార్తీక్‌.... ఈ దారుణానికి తెగబడ్డాడు. సంధ్యారాణికి ఇంటికి సమీపంలోనే.... మెయిన్‌ సెంట్రల్లోనే ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేగింది.
ఇంటికి వస్తున్న సంధ్యారాణికి అడ్డగించిన కార్తీక్‌.... తనను ప్రేమించాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఇద్దరి మధ్యా కొద్దిసేపు ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే సంధ్యారాణి నిరాకరించడంతో అంతలోనే తన వెంట తెచ్చుకున్న ట్రోల్‌ను సంధ్యారాణిపై పోసి నిప్పంటించాడు. దాంతో సంధ్యారాణి రోడ్డుపైనే కుప్పకూలింది. 70శాతానికి పైగా కాలిన గాయాలైన సంధ్యారాణి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories