పరిచయస్తుడే కాలయముడై ప్రాణం తీశాడు

పరిచయస్తుడే కాలయముడై ప్రాణం తీశాడు
x
Highlights

చదువు, సంస్కారం స్వతంత్ర్య వ్యక్తిత్వం కలిగి ఉండటం నేరమా? తనకు ఇష్టం లేని విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం పాపమా? ప్రేమను కాదంటే చంపేస్తారా?...

చదువు, సంస్కారం స్వతంత్ర్య వ్యక్తిత్వం కలిగి ఉండటం నేరమా? తనకు ఇష్టం లేని విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం పాపమా? ప్రేమను కాదంటే చంపేస్తారా? ప్రేమించలేనంటే ప్రాణం తీసేస్తారా? మూర్ఖులు, ఉన్మాదులు, పైలాపచ్చీస్ ఆవారా గాళ్ల నుంచి అమ్మాయిలకు రక్షణ లేదా? ప్రేమోన్మాది దాడికి బలై ప్రాణం విడిచిన సంధ్య వేస్తున్న ప్రశ్నలివి.

సంధ్య వయసుకు మించిన పరిణతి కుటుంబ భారాన్ని బాధ్యతగా మోయాలన్న ఆరాటం స్వశక్తితో కష్టపడి పైకి రావలన్న పట్టుదల ఇన్ని మంచి లక్షణాలున్న ఆడపిల్ల అన్యాయంగా ఓ ఆవారాగాడి పైత్యానికి బలైపోయింది అసలే దిగువ మధ్యతరగతి కుటుంబం ఆపై తలకు మించిన బాధ్యతలు ఈకారణంగానే సంధ్య ఆ ఆకతాయి ప్రేమను కాదంది తనకు ఉద్యోగం చూపిన పరిచయస్తుడే కాలయముడై తన ప్రాణం తీసేస్తాడని ఆమెకు ఆ క్షణంలో తెలిసుండదు ఉద్యోగం, సద్యోగం లేకుండా ఆకతాయిలా, చిల్లర తిరుగుళ్లు తిరిగే ఒక రోగ్ తనకు ప్రపోజ్ చేయడాన్ని ఆ ఆడపిల్ల సహించలేకపోయింది సంధ్య చదువుకుంది కాస్త సంస్కారముంది ఆపై కుటుంబమంటే అభిమానముంది కుటుంబసభ్యుల రుణం తీర్చుకోవాలనుకుంది బరువు, బాధ్యతలను తలకెత్తుకుంది.

ఒక వ్యక్తిత్వం లేని, అవగాహన లేని ఓ ఆకతాయి ప్రేమ ప్రపోజల్ ను అందుకే సున్నితంగానే తిరస్కరించింది మంచి ఉద్దేశంతోనే వారించింది కాదూ కూడదని వెంటపడుతున్న ఉన్మాది సంగతి ఎవరికి చెప్పాలో తెలియక చివరకు పనిచేస్తున్న షాపు యజమానికే కంప్లయింట్ చేసింది. అక్కడితో ఆగుతాడనుకుంది కానీ ఆ ఉన్మాది ఆగలేదు ఫోనులోనూ వేధింపులు మొదలెట్టాడు ఉద్యోగం నుంచి ఇంటికెళ్లే దారిలో వెంటపడ్డాడు విసిగించాడు బెదిరించాడు సంధ్యను కార్తీక్ నానా రకాలుగా భయపెట్టాడు. అయినా సంధ్య లొంగ లేదు సంధ్యది పరిణతి చెందిన వ్యక్తిత్వం ఆమెకు భవిష్యత్తుపై ఒక ప్రణాళిక ఉంది. తనకంటూ కొన్ని కలలున్నాయి తనకంటూ ఓ అందమైన జీవితాన్ని ఆమె నిర్మించుకుంటోంది.. స్వశక్తితో కుటుంబాన్నీ పోషిస్తోంది. మనసులు పొసగని చోట మనువు మంచిది కాదన్న ఉద్దేశంతోనే సంధ్య కార్తీక్ ప్రేమను తిరస్కరించింది కానీ తనకు దక్కని వ్యక్తి మరొకరికి దక్కరాదన్న మూర్ఖత్వం తప్ప కార్తీక్ కు జీవితంపై కనీస అవగాహన లేదు పరిణతి లేదు అందుకే మూర్ఖంగా ఉన్మాద చర్యకు ఒడిగట్టాడు నిష్కారణంగా ఓ ఆడకూతురి జీవితాన్ని చిదిమేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories