అనుమానంతో భార్యను చంపి.. ఆపై..

nanireddy
Updated on: 24 Dec 2018 2:02 PM IST
అనుమానంతో భార్యను చంపి.. ఆపై..
X

అనుమానం పెనుభూతమైంది.. అనుమానం కారణంగా కట్టుకున్న భార్యను, గర్భవతి అనికూడా చూడకుండా కడతేర్చాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన సుమలత కు.. మిర్యాలగూకు చెందిన మేకల మాధవ్ భార్య భర్తలు. మాధవ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి 2017 అక్టోబర్ నెల 6వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులకే సుమలత నెలతప్పింది. దీంతో మాధవ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కలతలు వచ్చాయి. కుటుంబపెద్దలు ఎంత నచ జెప్పినా మాధవ్ వినుకునేవాడుకాదు. ఆమెకు మరో వ్యక్తితో వివాహతర సంబంధం ఉందని అనుమానించడంతో.. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన సుమలత.. ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది.

ఇటీవల భర్యకోసం అత్తగారింటికి వెళ్లిన మాధవ్ తన భార్యను పంపించాలని కోరాడు. దీంతో కూతరు సుమలతను తీసుకొని ఈనెల 17న అమె తల్లి లింగమ్మ నల్లకుంటలోని ఇంటికివచ్చింది. రెండు రోజులు అక్కడే ఉండి అల్లుడికి సర్ధి చెప్పివెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లిందో లేదో సుమలత, మాధవ్ మధ్య గొడవపడటం మొదలెట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన మాధవ్ భార్యను హత్య చేశాడు. ఆపై తాను కూడా విద్యానగర్ - జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీస్ రైలు కింద పడి మాధవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లగా సుమలత మృతదేహం కనిపించింది. దాంతో అతను భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story