ఇంకా ఎన్ని బోగస్‌ ఓట్లు చూడాలో!!

ఇంకా ఎన్ని బోగస్‌ ఓట్లు చూడాలో!!
x
Highlights

హైదరాబాద్ లో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఒకే ఇంట్లో 183 నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లో కేవలం ఒకే ఒక వృద్ధురాలు వుంటుంది. కానీ , ఆ ఇంటి పేరిట 183...

హైదరాబాద్ లో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఒకే ఇంట్లో 183 నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లో కేవలం ఒకే ఒక వృద్ధురాలు వుంటుంది. కానీ , ఆ ఇంటి పేరిట 183 బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని బీజేపీ నేతలు బయటపెట్టారు.

లంగర్ హౌజ్ పరిధిలోని బాపు నగర్ లోని ఓ ఇంట్లో భారతమ్మ అనే వృద్ధురాలు అద్దెకు ఉంటుంది. ఈమె గత ఏడాదిన్నర నుంచి ఈ ఇంట్లో నివసిస్తుంది. ఈ ఇల్లు బూత్ నెంబర్ 141 పరిధిలోకి వస్తుంది. ఈ ఇంటి పేరిట ఏకంగా 183 ఓట్లు వుండడం చూసి బీజేపీ బూత్ ఇన్ ఛార్జ్ లు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లో భారతమ్మ తప్ప ఇతరులెవరూ కనిపించకపోవడంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుభాన్స్ తో కలిసి 183 ఓట్లున్న ఇంటిని పరిశీలించారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న భారతమ్మతో పాటు చుట్టుపక్కలవారితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో 183 ఓట్లు వుండడం విషయంపై విచారణ జరిపిస్తామన్నారు అధికారులు. ఇవి బోగస్ ఓట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories