వరద బాధితులకు సన్నీ లియోన్ 5 కోట్ల విరాళమా.. అసలు ఏమి ఇచ్చిందో చూస్తే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:44 PM IST
వరద బాధితులకు సన్నీ లియోన్ 5 కోట్ల విరాళమా.. అసలు ఏమి ఇచ్చిందో చూస్తే..
X

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ కేరళ వరద బాధితుల కోసం రూ.5 కోట్లు సాయం చేశారంటూ సోషల్‌ మీడియా లో ప్రచారం జరిగింది. ఈ వార్తను అడ్డుపెట్టుకుని ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానులకు సన్నీ సాయం చూపిస్తూ శాపనార్ధనలూ పెట్టుకున్నారు. తాజాగా అంత సాయం తాను చేయలేదని సాక్షాత్తు సన్నీ లియోన్ స్పష్టం చేసింది. అదంతా అసత్య ప్రచారం అని కూడా తేల్చేసింది. అయితే తన వంతు సాయం మాత్రం కేరళ వరద బాధితులకు కావాల్సింది ఇస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. భర్త డానియెల్‌ వెబర్‌, మరికొంత మంది బాలివుడ్‌ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్‌, పప్పును కేరళకు పంపించింది.

'ఈ రోజు నేను, నా భర్త డేనియల్‌ కలిసి కేరళల వరద బాధితుల్లో కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నాం. 1200 కిలోల బియ్యం, పప్పు(1.3 టున్నులు) అందించాం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికేం కావాలో నాకు తెలుసు. ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జుహులో అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిన ప్రతీక్‌, సిద్ధార్థ్‌ కపూర్‌, సువేద్‌ లోహియా చాలా గొప్పవారు' అని సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ పోస్ట్‌ చేశారు.

nanireddy

nanireddy

Next Story