ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది దుర్మరణం

nanireddy
Updated on: 24 Dec 2018 2:43 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది దుర్మరణం
X

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులూ జిల్లా రోహతంగ్‌ రాణి నల్లాలో కొండచరియల గుండా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి పడిపోయింది. దీంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. లోయలో పడ్డ ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కాగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో జిల్లా ఎస్పీ అప్రమత్తమయ్యారు. కొండ చుట్టూ డేంజర్ ఇండికేట్స్ ను అమర్చారు. ఇదిలావుంటే తాత్కాలికంగా ఆ ప్రదేశంలో వాహనాలు నిలిపివేసినట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story