పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
x
Highlights

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. బీసీ ఓటర్ల...

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. బీసీ ఓటర్ల జాబితాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో తప్పుగా చూపుతోందని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని పిటిషనర్‌ కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణలో బీసీ ఓటర్ల లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించి.. నివేదికను తమకు సమర్పించాలని బీసీ కమిషన్‌ను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories