పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌ ప్రీతీ

nanireddy
Updated on: 24 Dec 2018 2:53 PM IST
పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌ ప్రీతీ
X

'ప్రీతీ జంగానియా' ఈ పేరు గుర్తుండే ఉంటుంది.. అప్పట్లో నరసింహనాయుడు, తమ్ముడు చిత్రాల్లో నటించి హిట్ చిత్రాల హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేస్తున్న సమయంలో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమె కుటుంబం ముంబైలో నివాసముంటోంది. వారి నివాసానికి ఎదురుగా ఉండే వారితో గొడవ కారణంగా ప్రీతీ పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచింది. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇరుకుటుంబాలకు సర్ది చెప్పి పంపించారు.

nanireddy

nanireddy

Next Story