రేపు భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి..

nanireddy
Updated on: 24 Dec 2018 2:01 PM IST
రేపు భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలి..
X

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

nanireddy

nanireddy

Next Story