హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత... 7 కోట్ల నగదు సీజ్

x
Highlights

హైదరాబాద్ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. సైఫాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 7కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ నగదును ముంబై, ఢిల్లీ నుంచి...

హైదరాబాద్ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. సైఫాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 7కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ నగదును ముంబై, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం. నగదును తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక హైదరాబాద్‌లో ఈ స్థాయిలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories