వైద్యం వికటించి తలవెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి.. యువతి ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:48 PM IST
వైద్యం వికటించి తలవెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి.. యువతి ఆత్మహత్య
X

తలవెంట్రుకలు చిక్కుగా ఉన్నాయని కేశ సౌందర్యం కోసం ఓ యువతి చికిత్స చేయించుకుంది. అయితే అది వికటించి వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. అవమానంగా భావించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కొడగు జిల్లా విరాజపేట మండలం కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహా గంగమ్మ (18) బీబీఏ చదువుతోంది. తల వెంట్రుకలు అందంగా ఉండటానికి మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. అయితే ఆ ట్రీట్‌మెంట్‌ వికటించడంతో రెండు నెలల్లోనే ఆమె తల వెంట్రుకలు మొత్తం ఊడిపోయి గుండుగా మారింది. దీంతో సహచర విద్యార్థుల దృష్టిలో చులక అయిపోతానేమోన్న ఆందోళనతో కళాశాలకు వెళ్లడం మానేసింది. అయితే వారం రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. లక్ష్మణ తీర్థ నదిలో నేహ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంట్రుకలు ఊడిపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story