రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నటుడు.. పోటీ అక్కడినుంచే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నటుడు.. పోటీ అక్కడినుంచే..
X

టాలీవుడ్ నటుడు, దర్శకుడు జీవి సుధాకర్ నాయుడు త్వరలో రాజకీయాల్లో చేరనున్నారు. అంతేకాకుండా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్దమయ్యాడు. అందుకోసం సుధాకర్ నాయుడు కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే అయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం వెల్లడికాలేదు. కానీ అయన సన్నిహితులు మాత్రం జనసేనలో చేరే అవకాశముందని అంటున్నారు. తన రాజకీయ భవిశ్యత్ గురించి మాట్లాడిన జీవి.. కులాలు, మతాల పేరుతో ప్రజలను ఓట్ల కోసం విభజించి పాలిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలన సాగిస్తున్న పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయన్నారు.

nanireddy

nanireddy

Next Story