హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టు
x
Highlights

హైదరాబాద్‌లో మరోసారి భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. బడా వ్యాపారులకు.. హవాలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ నుంచి పోలీసులు...

హైదరాబాద్‌లో మరోసారి భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. బడా వ్యాపారులకు.. హవాలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ నుంచి పోలీసులు కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన పటేల్‌ తన వాహలా రాకెట్‌ ద్వారా బడా వ్యాపారులకు పెద్దమొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హవాలా బిజినెస్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న విషయాలను బయటకు లాగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories