ఇంతకీ సైన్యం అమ్ములపొదిలో జీశాట్‌ 7ఏ ఎలాంటి అస్త్రం?

ఇంతకీ సైన్యం అమ్ములపొదిలో జీశాట్‌ 7ఏ ఎలాంటి అస్త్రం?
x
Highlights

బోర్డర్‌లో జవాను, క్షణం ఆదమరిచినా శత్రువు దేశంలోకి చొరబడతాడు. జీశాట్‌ ఉపగ్రహం, సైన్యానానికి ఎలా అస్త్రమవుతుందో చూసేముందు, దాని మెజర్‌మెంట్స్‌ ఏంటో...

బోర్డర్‌లో జవాను, క్షణం ఆదమరిచినా శత్రువు దేశంలోకి చొరబడతాడు. జీశాట్‌ ఉపగ్రహం, సైన్యానానికి ఎలా అస్త్రమవుతుందో చూసేముందు, దాని మెజర్‌మెంట్స్‌ ఏంటో తెలుసుకుందాం. జీశాట్‌ 7ఏ ఉపగ్రహాన్ని సైనిక సమాచార ఉపగ్రహంగా పరిగణిస్తోంది ఇస్రో. భారత వాయుసేనకు 70శాతం, సైన్యానికి 30 శాతం ఉపయోగపడుతుంది ఈ ఉపగ్రహం.

జీశాట్‌ 7ఏ ప్రయోగంతో వైమానికదళం మరింత బలోపేతమవుతుంది. వైమానిక కమాండ్‌ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. ఎందుకంటే, కేయూ బ్యాండ్‌ ద్వారా, రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను ఇది అందిస్తుంది. ఈ సిగ్నళ్లు ప్రధానంగా విమానాలకు ఉపకరిస్తాయి. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం అవుతుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు, ఇదెంత ప్లస్‌ అవుతుందో మరింత సింపుల్‌గా చెప్పాలంటే, నింగిలో నిఘా నేత్రంగా పని చేస్తుంది. కింద జరిగి ప్రతి ప్రక్రియనూ జూమ్‌ చేసి మరీ చూస్తుంది. నింగినేలా, నీరు ఎక్కడైనా చీమచిటుక్కుమన్నా, ఇట్టే కనిపెట్టేస్తుంది. వెంటనే భద్రతాదళాలకు సమాచారమిస్తుంది. డ్రోన్‌ ఆపరేషన్లకు బూస్టింగ్‌ ఇస్తుంది జీశ్యాట్‌ 7ఏ కమ్యూనికేషన్‌ శాటిలైట్.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కోసమే, దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా తయారు చేశారు. ఎయిర్‌ బేస్‌లన్నింటికీ ఇంటర్‌లింక్‌గా ఇది పని చేస్తుంది. జెట్‌స్పీడ్‌ వేగంతో వచ్చే సమాచారంతో, వైమానికదళం అలర్ట్‌ అవుతుంది. శత్రువు ఎక్కడున్నాడో, ఎక్కడ చక్కర్లు కొడుతున్నాడో పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కేవలం ఎయిర్‌ఫోర్స్ కోసమే, జీశాట్‌ సెవన్‌ ఏను, ప్రయోగిస్తున్నా, ఆర్మీ, నౌకాదళానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బోర్డర్‌లో ఎలాంటి అలికిడి వినిపించిన, అలర్ట్‌ చేస్తుంది. అందుకే జీశ్యాట్‌ 7ఏను, ఇండియన్‌ ఐ ఇన్‌ ది స్కైగా పరిగణిస్తున్నారు.

ఇస్రో వరుస అంతరిక్ష ప్రయోగాలతో, పాకిస్తాన్‌, చైనాలు రగిలిపోతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌, వణికిపోతోంది. నింగినేలానీరు, ఇలా మూడింటి ద్వారా చొచ్చుకువచ్చే పాకిస్తాన్‌ చొరబాటుదారుల తాటతీస్తుందీ శాటిలైట్. అందుకే త్రివిధ దళాలు, ఇస్రోకు థ్యాంక్స్‌ చెబుతున్నాయి. ఇప్పటికే అనేక ఉపగ్రహాల ద్వారా, సైన్యానికి అస్త్రాలు అందిస్తున్న ఇస్రో, జీశ్యాట్‌ 7ఏ వంటి, బలమైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ప్రయోగంతో, మరింత బలాన్నిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories