మేడ మీద గోధుమ పంట...ఔరా అనిపిస్తున్న హైదరాబాద్ వాసి
భాగ్యనగరంలో ఎక్కడ చిన్న స్థలం కనిపించినా అక్కడ బిల్డింగ్ కట్టాల్సిందే ఉండేందుకు ఖాళీ స్థలం దొరకడమే గగనం...
భాగ్యనగరంలో ఎక్కడ చిన్న స్థలం కనిపించినా అక్కడ బిల్డింగ్ కట్టాల్సిందే ఉండేందుకు ఖాళీ స్థలం దొరకడమే గగనం అలాంటిది పంటలు పండించడం అంటే అస్సలు కుదరని పని అంతో ఇంతో ఈ మధ్యకాలంలో మేడపైన, ఇంటి ఆవరణలో కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుకుంటూ తమకు కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటున్నారు నగరవాసులు కానీ నేరేడ్‌మెట్‌కు చెందిన గణేష్ మాత్రం అందరికంటే భిన్నంగా తన మేడనే ఓ వ్యవసాయ క్షేత్రంలా మార్చేశాడు ప్రయోగాత్మకంగా డాబాపై గోధుమలు పండించాడు. వింటుంటే వింతగా ఉంది కదా .
మీరు చూస్తున్న ఈ గోధుమ పంట ఏదో గ్రామంలోనిది అని అనుకుంటే పొరపాటులో కాలువేసినట్లే ఇది అచ్చంగా భాగ్యగరంలోని ఓ ఇంటి మేడ మీద వేసిన పంట. ఇప్పటి వరకు ఇంటి మేడ మీద కుండీల్లో చెట్లను మొక్కలను పెంచడం చూశాం కానీ అందరికంటే భిన్నంగా ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు నేరేడ్‌మెట్ శ్రీకాలనీకి చెందిన గణేష్.
సాధారణంగా గ్రామాల్లో, పల్లెటూర్ల లో మత్రేమే వ్యావాసాయ భూములు, పంటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి, కాని హైదరబాద్ నగరంలో అడుగు అంగుళం స్థాలం కనబడితే చాలు వాటి రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వాలిపోతారు. కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తారు. కానీ తన మేడమీద ఖాళీ స్థలాన్ని వృథాగా పోనీయకుండా ఓ వ్యావసాయ క్షత్రంగా మార్చాడు గణేష్.
నగరం లో ఎక్కడ చూసినా కల్తీ కూరగాయలు, కల్తీ ఆహారమే లభిస్తోంది. ఒక్కటి కూడ నాణ్యమైనవి దొరకడం లేదని భావించి గణేష్ తన ఇంటి దాబా పై 400 గజాల స్థలంలో గోధుమను సాగు చేశాడు. గతేడాది నవంబర్‌లో గోధుమల సాగు ప్రారంభించాడు. సాగులో ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించలేదు. ఆవుపేడ, పేప పిండి వంటి ప్రకృతి ఎరువులను మాత్రమే వినియోగించాడు. 90 రోజుల్లో పంట చేతికి వచ్చింది. 36 కిలోల వరకు గోధుమల దిగుబడి వచ్చింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించారు గణేష్.
ప్రత్యేకమైన రూఫ్ గార్డెన్ ఎర్పుటు చేసి గతంలో కూరగాయలు, వరి సాగు చేసిన గణేష్ ఈ సారి గోధుమలను ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో , మేడ మీద పూర్తి ప్రకృతి విధానంలో పంటలు పండించుకోవచ్చంటున్నారు గణేష్...కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో నీళ‌్లు త్పనిసరిగా అందిస్తే..ఆశించిన పంట వస్తుందంటున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT