కిలో మిర్చి @ రూ.450

కిలో మిర్చి @ రూ.450
x
Highlights

ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి.రూ.10 , 20 లు కాకుండా ఏకంగా 400 రూపాయలు పెరిగి కేజీ రూ.450 దాకా పలుకుతున్నాయి. అయితే ఇది మన తెలుగు...

ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి.రూ.10 , 20 లు కాకుండా ఏకంగా 400 రూపాయలు పెరిగి కేజీ రూ.450 దాకా పలుకుతున్నాయి. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. పన్నెండు రోజులుగా వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రంలో పరిస్థితి. ఇక బంగాళ దుంపలు, ఉల్లిపాయలు,, క్యాబేజీ వంటి వాటినైతే కిలో రూ.90 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు. అంతరేటు ఎందుకంటూ దుకాణ దారులతో స్థానికులు గొడవ పడుతున్నారు. దానికి వ్యాపారులు తాము కూడా సరుకులు తేవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని సమాధానం చెబుతున్నారు. ఎక్కడ చూసిన పంట నష్టం, పైగా వేరే చోటునుంచి సరుకులు తేవాలన్నా వరదల ధాటికి రవాణా వ్యవస్త మెరుగుపదలేదు. దీంతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించి కూరగాయలు కొంటున్నారు కేరళ వాసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories