శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు?

nanireddy
Updated on: 24 Dec 2018 1:35 PM IST
శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు?
X

నెలరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. బుధవారం కేవలం ఒక పైసా తగ్గింపుతో విస్తుపోయిన వినియోగదారులకు తొందరలోనే శుభవార్త వెలువడనుంది. ఇంధనంపై ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు ఉన్నతాధికారి వెల్లడించారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే, త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 4 రూపాయల నుంచి 5 రూపాయల మేర తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభత్వం పెట్రోల్, డీజిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు విధించాల్సిన వ్యాట్ ను తగ్గించనుంది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా వారి కమిషన్ ను తగ్గించాల్సిందిగా ఆదేశాలు జారీచేయనుందని ఆయిల్ సంబంధిత ఉన్నతాధికారి హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

nanireddy

nanireddy

Next Story