వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే!

nanireddy
Updated on: 24 Dec 2018 1:29 PM IST
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే!
X

ఇటీవల కాలంనుంచి ఆంధ్రప్రదేశ్ లో వలసలు మళ్ళీ ఊపందుకున్నాయి. రెండేళ్ల కిందట వైసీపీనుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల పరిణామక్రమం రివర్స్ అవుతోంది. ప్రస్తుతం వలసపక్షులతో వైసీపీలో జోష్ వచ్చింది. తాజాగా మరో మాజీ శాసనసభ్యురాలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మద్దాల సునీత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. ప్రస్తుతం వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story