తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!

nanireddy
Updated on: 24 Dec 2018 1:35 PM IST
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
X

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చెయ్యాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18,428 పోలీస్ ఉద్యోగాల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 16,925 ఉద్యోగాలు కానిస్టేబుళ్లు కాగా.. 1503 ఎస్సై ఉద్యోగాల ఉన్నట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు . వీటి భర్తీ కోసం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18428 ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. కానిస్టేబుళ్ల కోసం ఇంటర్మీడియేట్ ప్రధాన విద్యార్హతగా నిర్ణయించగా.. ఎస్సై పోస్టులకు డిగ్రీ అర్హతగా విధించింది. ఇక జూన్‌ 9 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. .

nanireddy

nanireddy

Next Story