logo

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ బంపర్‌ ఆఫర్‌
Highlights

డిసెంబర్ 31 రాత్రి వేడుకల్ని సరికొత్తగా జరుపుకునేందుకు.. అర్థరాత్రి దాటిన తర్వాత.. నగరంలో న్యూఇయర్ వేడుకల్ని...

డిసెంబర్ 31 రాత్రి వేడుకల్ని సరికొత్తగా జరుపుకునేందుకు.. అర్థరాత్రి దాటిన తర్వాత.. నగరంలో న్యూఇయర్ వేడుకల్ని అసాంతం చూడాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం మెట్రో రైలు ఇవ్వనుంది. డిసెంబరు 31 సందర్భంగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది మెట్రో రైలు. ప్రతి రోజు రాత్రి పది గంటల వరకు మాత్రమే సర్వీసుల్ని అందించే హైదరాబాద్ మెట్రో రైలు.. ఈ రోజు (డిసెంబరు 31) మాత్రం అర్థరాత్రి 2.30 గంటల వరకు మెట్రో సర్వీసుల్ని నడపనున్నారు. ఎంచక్కా అర్థరాత్రి దాటిన తర్వాత మెట్రో రైల్లో ప్రయాణిస్తూ.. నగర అందాల్ని.. న్యూఇయర్ వేడుకల హంగామాను ఆకాశం నుంచి చూసే వీలు ఉంటుంది. కాకుంటే.. రష్ ఎక్కువైతే.. ఈ సందడిని చూసే అవకాశం కష్టమే సుమా!

లైవ్ టీవి

Share it
Top