Top
logo

దీపావ‌ళికి 'గోల్ మాల్ ఎగైన్‌'

దీపావ‌ళికి గోల్ మాల్ ఎగైన్‌
X
Highlights

'గోల్ మాల్‌', 'గోల్‌మాల్ రిట‌ర్న్స్‌', 'గోల్‌మాల్ 3'.. ఇలా అజ‌య్ దేవ్‌గ‌న్‌తో ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి...

'గోల్ మాల్‌', 'గోల్‌మాల్ రిట‌ర్న్స్‌', 'గోల్‌మాల్ 3'.. ఇలా అజ‌య్ దేవ్‌గ‌న్‌తో ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన 'గోల్ మాల్' సిరీస్ అన్నీ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ హాస్య చిత్రానికి నాలుగోభాగంగా 'గోల్‌మాల్ ఎగైన్' తెర‌కెక్కుతోంది. తొలి భాగంలో రిమ్మీ సేన్‌.. రెండు, మూడు భాగాల్లో క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తే, నాలుగో భాగంలో ప‌రిణితీ చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఎస్‌.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నాడు. ఈ నెల 22న ఈ సినిమా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నుండ‌గా.. వ‌చ్చే నెల 20న దీపావ‌ళి కానుకగా సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. తొలి మూడు భాగాల్లో న‌టించిన అర్ష‌ద్ వార్సి, తుషార్ క‌పూర్ ఈ చిత్రంలోనూ న‌టిస్తున్నారు.

Next Story