బంపర్ ఆఫర్.. రూ.1,299కే విమాన టికెట్‌

nanireddy
Updated on: 24 Dec 2018 1:37 PM IST
బంపర్ ఆఫర్.. రూ.1,299కే విమాన టికెట్‌
X

ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ గోఎయిర్‌ సంస్థ ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ రుచిచూపిస్తోంది. 'మాన్‌సూన్‌ సేల్‌' లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. రూ..1,299 రూపాయల ధరతో వన్‌వే టికెట్‌ను ఇస్తున్నట్టు గోఎయిర్‌ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం నాల్గవ తేదీ నుంచి ప్రారంభమై 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు జూన్‌ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పట్నా, పుణె, శ్రీనగర్‌ వంటి నగరాలకు ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.

nanireddy

nanireddy

Next Story