ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య..

nanireddy
Updated on: 24 Dec 2018 1:55 PM IST
ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య..
X

ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌ లో చోటుచేసుకుంది. గోపినగర్‌ కు చెందిన నటరాజన్‌ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) ప్రస్తుతం 'లా' చదువుతోంది. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్‌ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యానికి కేరళ వెళ్లారు. అయితే అశ్విని మాత్రం ఇంట్లోనే ఉంది. ఈ క్రమంలో తెన్నవన్‌ ఓ రోజు ఇంటికి వచ్చాడు.

అశ్వినితో ఉన్న సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో మూడు నెలలుగా అశ్విని బంధువుల ఇంట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని బంధువుల కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story