భవనం మీదనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..ఫోన్ లిఫ్ట్ చేయని తల్లి..

nanireddy
Updated on: 24 Dec 2018 2:01 PM IST
భవనం మీదనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..ఫోన్ లిఫ్ట్ చేయని తల్లి..
X

భవనం మీదనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నల్లగండ్ల హిమసాయి అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె ఎస్‌.హర్షిత (21) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌ కు వచ్చింది. గురువారం 11.30 ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వచ్చిన హర్షిత. భవనం పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. హర్షిత సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్‌ ద్వారా తండ్రి సుబ్రహ్మణ్యంకు ఫోన్‌ సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా హర్షిత ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. సెమిస్టర్‌లో ఫెయిల్‌ కావడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ పైన ఉన్నప్పుడే తల్లికి ఫోన్‌ చేయగా ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో 'బాయ్‌' అని మెసేజ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story