అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగిన యువతి

nanireddy
Updated on: 24 Dec 2018 2:50 PM IST
అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగిన యువతి
X

వసతి గృహంలో అన్నం పెట్టలేదని ఏకంగా అద్దం ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుందో యువతి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌ బేగుసరాయ్ బాలికల వసతిగృహం 42 మంది యువతులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే కొద్దిరోజులుగా వార్డెన్ అనుజా కుమారి తనకు కడుపునిండా అన్నం పెట్టడంలేదని మనస్థాపం చెందిన ఓ యువతి అద్దాలు పగులగొట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు. వార్డెన్‌తోపాటు ఇతర సిబ్బంది తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది.

nanireddy

nanireddy

Next Story