'జెమిని గణేశన్' కూతుళ్ళందరూ వీరే!

nanireddy
Updated on: 24 Dec 2018 1:30 PM IST
జెమిని గణేశన్ కూతుళ్ళందరూ వీరే!
X

అలనాటి మహానటుడు జెమిని గణేశన్ ఈతరం నటుడు కాకపోయినా అయన ఎవరో తమిళ సినిమాలో అయన ప్రాముఖ్యత ఏంటో ప్రేక్షకులు బాగానే తెలుసు . తమిళ సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర స్థానాన్ని సంపాదించిన జెమిని.. జీవితాంతం వివాదాలమయంగా బ్రతికారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న జెమినికి ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో మొదటి భార్య అయిన అలిమేలు కు నలుగురు కుమార్తెలు ఉన్నారు వారిలో ప్రఖ్యాత వైద్యురాలు కమల కూడా ఉన్నారు.. అనంతరం సినీనటి పుష్పలీలను ప్రేమిచారు ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు వారిలో బాలీవుడ్ సుప్రసిద్ధ నటీమణి రేఖ ఒకరు. ఇక మహానటి సావిత్రిని కూడా మూడో పెళ్లి చేసుకున్నాడు జెమిని ఆమెకు ఒక కూతురు ఉన్నారు. ఇక వీరందరు కలిసి ఇటీవలే ఓ వేడుకకు హాజరయ్యారు దాంతో అక్కాచెల్లెల్లు అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఇప్పుడిదే ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా జెమిని గణేశన్ నాల్గవ పెళ్ళికి సంబంధించి వివరాలు వెలువడకపోవడం గమనార్హం.

nanireddy

nanireddy

Next Story