బీజేపీకి మళ్లీ ‘గాలి’ సోకుతోందా??

బీజేపీకి మళ్లీ ‘గాలి’ సోకుతోందా??
x
Highlights

గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీ నాయకుడు. ఒకప్పుడు.. ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు నమ్మిన బంటు. ఆమె పాదాలకు నమస్కారం చేసేంత విధేయుడు. బీజేపీలో...

గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీ నాయకుడు. ఒకప్పుడు.. ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు నమ్మిన బంటు. ఆమె పాదాలకు నమస్కారం చేసేంత విధేయుడు. బీజేపీలో జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేయగల సమర్థుడిగా పేరున్నవాడు. కర్ణాటక నుంచి అంతర్జాతీయ స్థాయిలో బిజనెస్ వ్యవహారాలు నడిపించిన సమర్థుడు. కాలం కలిసిరాక.. మైనింగ్ వ్యవహారం అడ్డం తిరిగి.. నిందితుడిగా మారి.. జైలు జీవితం గడిపాడు.

అలాంటి గాలి జనార్దన్ రెడ్డి.. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఆయన తమ్ముడు.. సోమశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అచ్చివచ్చిన బళ్లారి నుంచే బీజేపీ టికెట్ పై గాలి పోటీ చేసే అవకాశం ఉందని సోమశేఖర్.. మీడియాతో అన్నాడట. ఈ విషయంపై.. ఇటు బీజేపీ కానీ.. బళ్లారిలో పార్టీ కేడర్ కానీ.. స్పందించడం లేదు.

మరోవైపు.. బళ్లారిలో పోటీకి తెగించితే.. గాలి జనార్దన్ రెడ్డిని అడ్డుకునేవాళ్లు ఉండే అవకాశం కూడా లేదు. దీంతో.. బళ్లారి బరిలో గాలి వీచే అవకాశం అయితే ఉంది కానీ.. అది బీజేపీ నుంచా కాదా.. అన్నది మాత్రమే అనుమానాస్పదంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. త్వరలోనే ఈ అయోమయంపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories