మెట్రో ప్రయాణం ఫ్రీ!

మెట్రో ప్రయాణం ఫ్రీ!
x
Highlights

బెర్లిన్: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్రస్థానం, కార్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం అయిన జర్మనీలో.. కార్ల వాడకాన్ని తగ్గించడానికి ప్రజారవాణా సదుపాయాన్ని...

బెర్లిన్: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్రస్థానం, కార్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం అయిన జర్మనీలో.. కార్ల వాడకాన్ని తగ్గించడానికి ప్రజారవాణా సదుపాయాన్ని ఉచితంగా ప్రజ లకు అందించాలని ఆలోచిస్తున్నారు! ఆ దేశంలోని దాదాపు 20 నగరాల్లో నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్య స్థాయిని తగ్గించ డానికి ఇదే మంచి మార్గమని భావిస్తున్నారట. ప్రజార వాణాను ఉచితంగా అందిస్తే అప్పుడు ప్రజలు సొంతవాహ నాలు వాడటం మానుతారని, దానివల్ల రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గడంతోపాటు కాలుష్యం కూడా అదుపులోకి వస్తుందని జర్మన్ పాలకులు అంటున్నారు.

యూరోపియన్ యూనియన్ విధించిన వాయు కాలుష్య లక్ష్యాలను చేరుకోలేకపోతే భారీ మొత్తంలో జరిమానాలు కట్టాల్సి ఉంటుంది కాబట్టి దాని కంటే ప్రజారవాణా ఉచితంగా అందించడమే మేలని చెబుతున్నారు. ముందుగా పశ్చిమ జర్మనీ ప్రాంతంలోని ఐదు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి చూస్తారు. ఇలా ఉచితంగా రవాణా సదుపాయం అందించడానికి ప్రభుత్వం మీద పడే భారం ఎంతన్నది మాత్రం ఇంకా కచ్చితంగా తెలియలేదు. ముఖ్యంగా మెట్రో రైలు ప్రయాణాన్ని ఉచితంగా ఇవ్వాలన్నది జర్మన్ల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ మేరకు జర్మనీ పర్యావరణ శాఖ మంత్రి బార్బరా హెండ్రిక్స్ ఈయూ పర్యావరణ కమిషనర్‌కు తమ ప్రణాళికను వివరిస్తూ ఓ లేఖ రాశారు. దీనికి కావల్సిన నిధులను ప్రభుత్వం తో పాటు కార్ల కంపెనీలు కూడా సమకూరుస్తాయని ఆమె అందులో పేర్కొన్నారు. ఈయూ విధించిన కాలుష్య పరిమితిని దాదాపు 20 జర్మన్ నగరాలు ఎప్పుడో దాటేశాయి. అక్కడ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దాంతో శివార్లలోని పలు పట్టణాల్లో సైతం డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పాతబడిన డీజిల్ వాహనాల నుంచే ఎక్కువగా నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories