న‌గ‌ర వాసుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ...నేటి రాత్రి ఉచిత క్యాబ్‌లు!

న‌గ‌ర వాసుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ...నేటి రాత్రి ఉచిత క్యాబ్‌లు!
x
Highlights

న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎటు చూసినా కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెట్ట‌బోతున్నామ‌నే వాతావ‌ర‌ణం కొట్టొచ్చిన‌ట్లు క‌న‌బడుతోంది. షాపింగ్...

న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎటు చూసినా కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెట్ట‌బోతున్నామ‌నే వాతావ‌ర‌ణం కొట్టొచ్చిన‌ట్లు క‌న‌బడుతోంది. షాపింగ్ మాల్స్, బేక‌రీలలో ఆఫ‌ర్లే మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. ఆ ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకోవ‌డానికి క‌ష్ట‌మ‌ర్లు క్యూలుక‌డుతున్నారు. ఇక రెస్టారెంట్లు బార్లు అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొత్త‌సంవ‌త్స‌రానికి గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌ధ్యం బాటిళ్లు విప‌రీతంగా సేల్ అవుతున్న‌ట్లు మార్కెట్ పండితులు అభిప్రాయప‌డుతున్నారు. దీనికితోడు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయ‌ని ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఏ4 లైసెన్స్ ఉన్న వైన్‌షాప్, బార్లు రాత్రి 12 గంటల వరకు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాలు అర్ధరాత్రి 1 వరకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చినట్టు ఆబ్కారీ, వాణిజ్యపన్నులశాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. దీంతో మందుబాబులు వైన్ షాపుల ఎదుట బారులు తీరారు. ఇక కొత్త సంవ‌త్స‌రాన్ని దృష్టిలో ఉంచుకొని ‘హమ్‌ ఆప్‌కా సాత్‌ హై’ అంటూ ఎటువంటిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేలా తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్ ముందుకు వ‌చ్చింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో మ‌ద్యం మ‌త్తులో మునిగితేలుతున్న‌వార‌కి 300 వాహ‌నాల‌తో ఉచిత క్యాబ్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌లు తెలిపారు. ఎవ‌రికైనా అవ‌స‌రం అనిపిస్తే ఉచిత సేవల కోసం 91776 24678, 88970 62663 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల వరకే ఈ సేవలు ఉంటాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories