షాకింగ్ ట్విస్ట్.. శ్రీదేవికి గుండెపోటు కాదు..

అందాలతార శ్రీదేవి మృతి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి....
అందాలతార శ్రీదేవి మృతి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు తేలింది. పెళ్ళి ఫంక్షన్‌కు రెడీ అవడానికి ముందు బాత్ రూంకి వెళ్ళిన శ్రీదేవి పక్కనే ఉన్న టబ్‌లో మునిగి చనిపోయినట్లు దుబాయ్ ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. దుబాయ్ జువైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో ఉన్ని శ్రీదేవి శనివారం రాత్రి డిన్నర్‌కు వెళ్ళడానికి ముందు బాత్ రూంకు వెళ్ళారు. బాత్ రూంలో ఆమె రెడీ అవుతున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తూ టబ్‌లో పడిపోయారు. ఏదైనా పట్టుకుని నిలబడదామని శ్రీదేవి యత్నించింది. అయితే అది సాధ్యం కాలేదు. అదే సమయంలో ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న బాత్ టబ్‌లో పడిపోయింది.
ఇంతవరకు శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు అందరూ భావించారు. అయితే దుబాయ్ అధికారులు విడుదల చేసిన పోస్ట్ మార్టం నివేదికలో అసలు నిజాలు తెలిశాయి. వారు విడుదల చేసిన నివేదికలో శ్రీదేవికి ఎక్కడా గుండెపోటు వచ్చినట్లు చెప్పలేదు. బాత్ టబ్‌లో పడటం వల్లే ఆమె చనపోయినట్లు దుబాయ్ అధికారుల నివేదిక వివరించింది. శ్రీదేవి బాత్ బట్‌లో పడిపోయిన తర్వాత ఆమె ముఖం మొత్తం నీటిలో మునిగిపోయింది. టబ్‌లో పడటంతో ఆమె ఊపిరాడలేదు. ఊపిరి అందకపోవడంతో బాత్ టబ్‌లోనే శ్రీదేవి ప్రాణాలు వదిలింది. శ్రీదేవి ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఊపిరాడక చనిపోయినట్లు దుబాయ్ అధికారుల నివేదిక నిర్ధారణ అయ్యింది. అంతెకాదు శ్రీదేవికి చేసిన రక్తపరీక్షలో కొద్ది మోతాదులో ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా కనిపించాయి.
అయితే ఎంతో ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి బాత్ టబ్‌లో పడి చనిపోయారనడం పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఒకవేళ బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోతే ఆమె ఎందుకు పైకి లేవలేకపోయిందనే ప్రశ్న తలెత్తుతోంది. శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించకపోవడం కూడా మరిన్న అనుమానాల్ని పెంచుతోంది. ఒకవేళ బాత్ టబ్‌లో పడి ఊపిరాడని స్థితిలో ఉన్న శ్రీదేవి ఎందుకు సాయం కోసం అరవలేకపోయారనేది మరో ప్రశ్న.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT