ఫిట్‌నెస్‌ ఫ్రాడ్‌... ఆర్టీవోలో లంచాల రాజాలు!!

ఫిట్‌నెస్‌ ఫ్రాడ్‌... ఆర్టీవోలో లంచాల రాజాలు!!
x
Highlights

RTO.. ప్రభుత్వానికి కోట్లు సమకూర్చేశాఖలో ఇదొకటి. వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న.. రవాణాశాఖకు ప్రభుత్వం అవసరమైన మౌలికవసతులు కల్పించడం లేదు. ఏడాది...

RTO.. ప్రభుత్వానికి కోట్లు సమకూర్చేశాఖలో ఇదొకటి. వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న.. రవాణాశాఖకు ప్రభుత్వం అవసరమైన మౌలికవసతులు కల్పించడం లేదు. ఏడాది పొడవునా టార్గెట్‌ల పేరుతో వెంటపడి ఆదాయాన్ని రాబడుతున్న ప్రభుత్వం.. ఆ శాఖకు అవసరమైన పరికరాలు అందించడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏడాది రవాణా వాహనాలు తప్పనిసరిగా ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలి. కానీ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఫిట్‌నెస్ టెస్ట్ చేసే పరికరాలు, మిషనరీ లేదనేది హెచ్ఎంటీవీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఒక్కో వాహనం ఫిట్‌నెస్ టెస్ట్‌కు ఆర్టీఓ 400 వసూలు చేస్తుంది. ఇలా.. ఏడాదికి కోట్లు సమకూరుతాయి. ఇంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా.. ఆర్టీఓకు మాత్రం.. టెస్ట్ చేసే మిషనరీ సమకూర్చడంలో మాత్రం కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. వచ్చిన ఆదాయం.. రాష్ట్రప్రభుత్వం ఖజానాలోకి చేరుతుండటంతో.. తమకేమీ పట్టదన్నట్లు కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. కమర్షియల్ వాహనాలన్నీ.. అంటే.. పసుపురంగు నెంబర్ ప్లేట్‌తో ఉన్న ప్రతివాహనం.. ప్రతి ఏడాది ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలి. సంబంధిత అధికారి నుంచి వాహనం ఫిట్‌గా ఉన్నట్లు సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఐతే.. సెంట్రల్ మోటార్ వెహికిల్ యాక్ట్ రూల్ 81 ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం ఒక్కో వాహనానికి.. ఫిట్‌నెస్ టెస్ట్ కోసం 4 వందలు వసూలు చేస్తోంది. ఈ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా.. ఆధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, మెషినరీతో చేయాలి. అప్పుడే.. ఆ వాహనం నిజంగా ఫిట్‌గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు వెళ్లినప్పుడు.. అలాంటివేవీ కనిపించవు.
ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు ఉపయోగించే పరికరాలు గానీ.. మెషీనరీ గానీ లేదు. దీంతో.. సంబంధిత అధికారి ఆ రవాణా వాహనాన్ని పైపైన చూసి.. సర్టిఫై చేసి పంపుతున్నట్లు hmtv పరిశీలనలో తేటతెల్లమైంది. ఒక వాహనం కండిషన్, ఫిట్‌నెస్ సరిగా ఉందా.. లేదా అని తెలుసుకోవాలంటే.. 14 రకాలు టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని యంత్రపరికరాలతో చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సంబంధిత అధికారి.. స్వయంగా చూడడం, ఫిజికల్‌గా వాహనాన్ని డ్రైవ్ చేసి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహనం గేర్, స్టీరింగ్, బ్రేక్ కండిషన్, లైటింగ్ చెకప్, ఇంజన్ ఫిట్‌నెస్‌ లాంటి టెస్ట్‌లు చేసి.. వాహనం వాస్తవ కండిషన్‌ను సర్టిఫై చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇవన్నీ చేయాలంటే.. ఆర్టీఓకి సాధన సంపత్తి సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పైనే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories