దారుణం..కారులో వ్యక్తి సజీవదహనం
ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాజీవ్‌రహదారిపై జరిగింది. సిద్దిపేట వైపు వెళ్తున్న ఏపీ 11పీ 8686 నంబరుగల కారులో అనూహ్యంగా మంటలు రేగాయి. దాంతో పరిస్థితిని చూసిన స్థానికులు మంటలు ఆర్పీ కారులోని వ్యక్తిని బయటకు తీసే ప్రయత్నం చేసారు. కానీ డోర్లు లాక్ అవ్వడంతో సాధ్యపడలేదు మంటలదాటికి ఆ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పూర్తిగా కాలడంతో కారులో ఉన్నవ్యక్తి ఎవరన్నది పోలీసులకు అర్ధంకావడం లేదు.
Next Story




