వృద్ధుడికి నోటితో శ్వాస అందించి.. ప్రాణం పోసిన యువతి

x
Highlights

ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువతి వృద్దుడి ప్రాణాలు కాపాడింది. రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు హటాత్తుగా కింద పడిపోయాడు. శ్వాస అందక స్పృహ తప్పడంతో...

ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువతి వృద్దుడి ప్రాణాలు కాపాడింది. రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు హటాత్తుగా కింద పడిపోయాడు. శ్వాస అందక స్పృహ తప్పడంతో అక్కడే ఉన్న ఓ యువతి వృద్ధిడిని పడుకోబెట్టింది. రెండు చేతులతో అతని ఛాతి మీద గట్టిగా నొక్కుతూ నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా దాదాపు అరగంట పాటు చేసి అతడికి ప్రాణం పోసింది. ఈ ఘటన చైనాలోని జింజూ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వృద్ధుడికి సీపీఆర్‌ విధానం ద్వారా ప్రాణం పోసిన యువతిని జింజూలోని మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ డింగ్‌ హుయ్‌గా గుర్తించారు. వృద్ధుడి ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమైన డింగ్‌ హుయ్‌ ఇంటికి వెళ్లాల్సిన ట్రైన్‌ని కూడా మిస్సయింది. యువతి చూపిన చొరవకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories