వివాహేతర సంబంధం : చిన్నారిని ఆటోకేసి కొట్టి.. భార్యను..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
వివాహేతర సంబంధం : చిన్నారిని ఆటోకేసి కొట్టి.. భార్యను..
X

భార్యపై కోపంతో పది నెలల బాబును ఆటోకేసి కొట్టాడు శివ అనే వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మేడపల్లికి చెందిన శివ, అనూష పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని జగద్గిరి గుట్ట పరిధిలోని లెనిన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కేపీహెచ్‌బీలో శివ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడే ఉంటూ... అప్పుడప్పుడు మాత్రమే అనూష దగ్గరికి వస్తున్నాడు. అదే సమయంలో నిన్న రాత్రి సమయంలో రావడంతో శివను భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో భార్యపై తీవ్రంగా దాడి చేసిన శివ అంతరం ఆమె చేతిలో ఉన్న పిల్లాడిని ఆటోకేసి కొట్టాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాబును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉంది. కాగా శివను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

nanireddy

nanireddy

Next Story