తాలిబన్ల గురువు సామ్యూల్ హక్ దారుణ హత్య

nanireddy
Updated on: 24 Dec 2018 3:47 PM IST
తాలిబన్ల గురువు సామ్యూల్ హక్ దారుణ హత్య
X

ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్‌ గా భావించే, మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) పాక్ లో దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హక్‌ గొంతు కోసి హత్య హతమార్చారు. హక్ హత్యకు కొన్ని నిమిషాల ముందు అయన అనుచరులు బయటికి వెళ్లిపోయారు. దాంతో అదే అదనుగా భావించిన దుంగగులు అయనపై దాడికి తెగబడ్డారు. కత్తితో అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపేశారు. తిరిగి వచ్చిన అంగరక్షకులు.. హక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దాంతో హక్ కుమారుడు హమిదుల్ హక్ కు సమాచారం అందించారు. ఇటీవల పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు దైవదూషణ కేసులో క్రిస్టియన్‌ మహిళకు మరణశిక్షను రద్దు చేయడానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. హక్ హత్య ఉదంతంతో అయన మద్దతుదారులు రావల్పిండి, ఇస్లామాబాద్లో విధ్వంసం సృష్టించారు. ఇక హక్‌ హత్యపై, పాకిస్తాన్ అంతర్గత మంత్రి, పాకిస్తానీ తాలిబాన్ ఆర్మీ చీఫ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.

nanireddy

nanireddy

Next Story