మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..

nanireddy
Updated on: 24 Dec 2018 2:11 PM IST
మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..
X

మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్‌ కాలనీ శివారులో పోలీసులు కార్డాన్ సెర్చ్ చేస్తుండగా అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ఇంతలో వీరు పోలీసులకు తారస పడ్డారు. పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని జైలుకు తరలించి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.ఇదిలావుంటే ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14మంది మవోయిస్టులు మరణించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ జరుగుతోంది.

nanireddy

nanireddy

Next Story