మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అరెస్ట్

nanireddy
Updated on: 24 Dec 2018 2:39 PM IST
మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అరెస్ట్
X

మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు(బుధవారం) సునీతారెడ్డి భర్త వర్ధంతి వేడుకల సందర్బంగా ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. దాంతో అక్కడ జరిగే అన్ని పార్టీల కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనేపథ్యంలో బుధవారం లక్ష్మారెడ్డి వర్ధంతి వేడుక ఆగిపోయింది. దీంతో ఆవేశానికి లోనైనా సునీతారెడ్డి ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి చేయి దాటి పోతుందన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని నర్సాపూర్ స్టేషన్ కు తరలించారు.

nanireddy

nanireddy

Next Story