టీకాంగ్రెస్ కు మరో షాక్.. రాజీనామా చేసేందుకు రెడీ అయిన మాజీ మంత్రి?

nanireddy
Updated on: 24 Dec 2018 1:47 PM IST
టీకాంగ్రెస్ కు మరో షాక్.. రాజీనామా చేసేందుకు రెడీ అయిన మాజీ మంత్రి?
X

నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసిన సంగతి మరవకముందే మరోనేత కూడా ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. చాలా రోజులుగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పార్టీ మారుతాడ‌ని వ‌స్తున్నవార్తలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి . ఆయ‌న తన కుమారుడుతో కలిసి త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే అసంతృప్తితో ముకేశ్ గౌడ్ ఉన్నారు. గతంలో మార్కెటింగ్ శాఖా మాంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ముకేశ్ గౌడ్ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. కాగా కీలకనేతలు రోజురోజుకు పార్టీ వీడుతుండటంతో ఉలిక్కి ప‌డ్డ కాంగ్రెస్ ముఖ్య నేత‌లు జానారెడ్డి నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు.

Image result for mukesh goud images

nanireddy

nanireddy

Next Story