శ్రీమంతుడు అయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

nanireddy
Updated on: 24 Dec 2018 1:24 PM IST
శ్రీమంతుడు అయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
X

గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును టేకప్ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. అందులో భాగంగా రైతు సమస్యల అధ్యయనంకోసం ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి రైతుల పరిస్థితులు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తన పర్యటనలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం సహలాలపుట్టుగలో స్వచ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో కలియ తిరిగారు. పరిశీలించిన అనంతరం గ్రామాన్ని బాగుచేయాలని భావించి దత్తత తీసుకుంటానన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలన్న అయన ఆ ఆదిశగా అడుగులు వేయాలని ప్రజలకు సూచించారు.అందరూ కలిసి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు.

nanireddy

nanireddy

Next Story